'నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి'
జనగామ జిల్లాలో మొదటి విడతగా 5 మండలాల్లో పంచాయతీ ఎలక్షన్లు జరగనున్న నేపథ్యంలో గురువారం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలని, ఎన్నికల సంఘం నియమాలను పక్కాగా పాటించాలని అధికారులకు సూచించారు.