గ్యాస్ కొరతపై పార్లమెంట్ వద్ద విపక్షాల నిరసన

గ్యాస్ కొరతపై పార్లమెంట్ వద్ద విపక్షాల నిరసన

LoP నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో భారీ నిరసన చేపట్టారు. ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యుడు వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని రాహుల్ మండిపడ్డారు. తక్షణమే సరఫరాను పునరుద్ధరించి, కృత్రిమ కొరతను అరికట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.