ఐసిస్‌తో లింకులు.. విద్యార్థి అరెస్ట్
ఉగ్రవాద సంస్థ ISISకు చెందిన ఆన్‌లైన్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్న ఓ విద్యార్థిని యూపీలో అరెస్ట్ చేశారు. నిందితుడు 19 ఏళ్ల డెంటల్ విద్యార్థి హారిష్ అలీగా నిఘా అధికారులు గుర్తించారు. భారత్‌తో సహా విదేశాల్లోని ఐసిస్‌కు చెందిన వ్యక్తులతో సంబంధాలు కొనసాగించాడని తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.