మహిళ హత్యకు సంబంధించి పోస్టర్ విడుదల

మహిళ హత్యకు సంబంధించి పోస్టర్ విడుదల

NZB: నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో బాసర ప్రధాన రహదారి పక్కన జరిగిన హత్య వివరాలకు సంబంధించి పోస్టర్‌ను ఆదివారం నవీపేట్ ఎస్సై తిరుపతి విడుదల చేశారు. హత్య అయిన మహిళ ఎత్తు 5.2 ఇంచులు, చామన ఛాయా రంగులో ఉందన్నారు. మహిళ ఎడమ కాలుపై పుట్టుమచ్చ ఉందన్నారు. ఎక్కడైనా మహిళ మిస్సింగ్ అయితే నవీపేట్ పోలీసులను సంప్రదించాలన్నారు.