బాలసంస్కార కేంద్రంలో ఆధ్యాత్మిక వేడుకలు

బాలసంస్కార కేంద్రంలో ఆధ్యాత్మిక వేడుకలు

మహబూబ్‌నగర్ జిల్లా వీరన్నపేట నీలకంఠ స్వామి దేవాలయంలో బాలసంస్కార కేంద్రం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సుమారు 85 మంది బాలబాలికలు లింగాష్టకం, గోవింద నామావళి, హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలను భక్తితో పఠించారు. ధ్యానం, మంగళహారతి నిర్వహించి పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించారు.