పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే

NRPT: మఖ్తల్ పట్టణం ద్వారక ఫంక్షన్ హాల్లో మఖ్తల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్ధానిక ఎన్నికలో బీఆర్ఎస్ కార్యకర్తలు గెలవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.