VIDEO: విస్తృత తనిఖీలు.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం
MDK: నిజాంపేట మండల కేంద్రంలో మత్తు పదార్థాల నియంత్రణపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. సోమవారం బాంబ్ & డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల విక్రయం, వినియోగాన్ని ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.