అధికార లాంఛనాలతో వైమానిక జవాన్ అంత్యక్రియలు

NRML: ముధోల్ మండలంలోని తరోడ గ్రామానికి చెందిన లక్ష్మీఈశ్వర్ ప్రసాద్ అనే వైమానిక జవాన్ రెండ్రోజుల క్రితం మృతి చెందిన సంఘటన తెలిసిందే. కాగా శనివారం జవాన్ డెడ్ బాడీ స్వగ్రామానికి రాగా వైమానిక దళాలు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ముందుగా జవాన్ పార్థివదేహాంపై జాతీయ పతాకాన్ని ఉంచి అశ్రునయనల మధ్య అంత్యక్రియలు చేశారు.