జంట జలాశయాలకు తగ్గిన వరద

జంట జలాశయాలకు తగ్గిన వరద

RR: జంట జలాశయాలకు వరద తగ్గుముఖం పట్టింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వారం రోజులుగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు వరద ప్రవాహం కొనసాగింది. హిమాయత్ సాగర్ జలాశయంలోకి వరదనీరు ఈసీ వాగు మీదుగా వస్తుండడంతో రెండు రోజుల క్రితం జలమండలి అధికారులు 5 క్రస్టు గేట్లు ఎత్తి ఈసీలోకి నీటిని వదిలారు. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గడంతో ఒక గేటు నుంచి మాత్రమే నీటిని వదులుతున్నారు.