నిర్దేశించిన గడువులోగా సమస్య పరిష్కారం : JC
NLR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కారం చూపేందుకు అధికారులు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై వచ్చిన అర్జీదారుల నుంచి తిక్కన ప్రాంగణంలో అర్జీలు స్వీకరించి పరిశీలించారు. నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులు పరిష్కారం చేసే విధంగా ఆదేశించారు.