నెమలి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు
NTR: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం నందు సామూహిక సత్యనారాయణ వ్రతం జరిగినట్లు ఆలయ సహాయక కమిషనర్ నేల సంధ్య తెలిపారు. కార్తీక మాసాం రెండవ సోమవారం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో పదిమంది దంపతులు పాల్గొన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కావూరి శశిరేఖ పలు ప్రముఖులు ఉన్నట్లు వివరించారు.