చందోలులో ప్రమాదకరంగా కరెంట్ స్తంభాలు

చందోలులో ప్రమాదకరంగా కరెంట్ స్తంభాలు

BPT: పిట్టలవానిపాలెం మండలం చందోలు శివారులో విద్యుత్ స్తంభాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. పలుచోట్ల స్తంభాలు వాలిపోయి ఉండగా, వైర్లు నేలకు దగ్గరగా వేలాడుతున్నాయి. సమస్యను పలుమార్లు తెలియజేసినా అధికారులు స్పందించలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరుగక ముందే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.