గంజాయి బ్యాచ్ అరెస్ట్
కృష్ణా: కృత్తివెన్ను మండలం చినపాండ్రాక పంచాయతీ, రామాపురంలో రొయ్యల చెరువుల వద్ద గంజాయి కలిగి ఉన్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. సీఐ వివరాలను మేరకు.. ఎస్సై పైడి బాబు సిబ్బందితో కలిసి శనివారం రాత్రి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఈ అరెస్టులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.