జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్

PLD: 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా వందనం చేసి ఆయన వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.