రాళ్ల రహదారిలో నరకయాతన
PPM: సంగంవలన పంచాయతీ పరిధిలోని అడ్డూరివలస, సీతంపేట గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతిని రవాణాకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని స్థానికులు తెలిపారు. పదేళ్ల క్రితం వేసిన మెటల్ రోడ్డు ప్రస్తుతం రాళ్లు తేలిపోవడంతో అధ్వానంగా మారిందన్నారు. ఈ మార్గం ద్వారా పది గిరిజన గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని వెల్లడించారు.