ఎరువులను అధిక ధరలకు అమ్మితే చర్యలు: కలెక్టర్

NLG: ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్‌పీ ధరలకు మించి ఎరువులను అమ్మినా లేదా ఇతర ఎరువులతో లింకు పెట్టినా అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియాతో సహా అన్ని ఎరువులు సరిపోయినంతగా నిల్వలు ఉన్నాయని, అందువల్ల రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు.