రీల్స్ పిచ్చి.. తుపాకీతో కాల్చుకున్న యువకుడు

రీల్స్ పిచ్చి.. తుపాకీతో కాల్చుకున్న యువకుడు

ఇటీవల రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తన స్నేహితుడు వీడియో తీస్తుండగా పవన్ అనే యువకుడు గన్ లోడ్ చేయడం చూపించాడు. దానిని కాల్చొద్దని వీడియో తీసిన వ్యక్తి హెచ్చరిస్తుండగా పవన్ తన ఛాతిపై తానే కాల్చుకున్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన ఢిల్లీలోని దల్లుపురా ప్రాంతంలో చోటుచేసుకుంది.