గంగవరం బీచ్‌లో యువకుడు గల్లంతు

గంగవరం బీచ్‌లో యువకుడు గల్లంతు

విశాఖ: గంగవరం సమీపంలోని మాధవస్వామి టెంపుల్ వద్ద యువకుడు కెరటాల తాకిడికి గల్లంతయ్యాడు. ఒడిశాకు చెందిన నలుగురు యువకులు, గంగవరం సమీపంలో బీచ్ సందర్శనకు వెళ్ళగా మాధవస్వామి టెంపుల్ వద్ద రాళ్లపై నిలబడి రూపక్ సాయి అనే యువకుడు కెరటాల ఉధృతికి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న న్యూపోర్ట్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.