పాత్రపురంలో అంబేడ్కర్‌కు ఘన నివాళి
MLG: వెంకటాపురం మండల వ్యాప్తంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పాత్రపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పుష్పవతి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. ఆయన చూపిన బాట ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని పేర్కొన్నారు.