ఉస్మానియాలో నీళ్లు మోస్తున్న వీల్ చైర్లు..!

HYD: ఉస్మానియా ఆస్పత్రిలో సిబ్బంది వీల్ చైర్లను రోగుల కోసం కాకుండా వాటర్ క్యాన్లు తరలించడానికి ఉపయోగిస్తున్న ఘటన వెలుగుచూసింది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన వీల్ చైర్లు ఇలా ఉపయోగించడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని రోగుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.