విద్యుత్ సరఫరాకు అంతరాయం
W.G: భీమవరం మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. లోసరిలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ఉప కేంద్రానికి లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే గొల్లవానితిప్ప, దెయ్యాలతిప్ప, తోక తిప్ప, నాగేంద్ర పురం తదితర ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ ఉండదన్నారు.