అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ

BDK: మణుగూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. సాయిబాబా గుడి ప్రాంతంలో ప్రధాన రహదారిపై నిర్మాణం మధ్యలో వదిలేసిన డివైడర్‌పై ఆదివారం తెల్లవారుజామున ఓ లారీ అదుపుతప్పి దూసుకెళ్ళింది. డ్రైవర్ నిర్లక్షం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ మార్గంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.