అమెజాన్ నుంచి మరో 10 లక్షల ఉద్యోగాలు
2030 నాటికి భారత్‌లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. ఏఐ, వ్యాపార విస్తరణపై ఈ డబ్బును వెచ్చించనుంది. దీంతో మరో 10 లక్షల ఉద్యోగాలను కల్పించనుంది. 2010 నుంచి ఇప్పటివరకు అమెజాన్ భారత్‌లో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. అలాగే భారత్‌లో 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ఇప్పటికే ప్రకటించారు.