VIDEO: "నిరంతర చికిత్సతో TBని పూర్తిగా నయం చేయవచ్చు"
MLG: జిల్లా కేంద్రంలో నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా టీబీ నియంత్రణ అధికారి డా. చంద్రకాంత్ మీడియాతో మాట్లాడారు. సరైన ఆహారం, నిరంతర చికిత్సతో TBని పూర్తిగా నయం చేయవచ్చని ఆయన తెలిపారు. జిల్లాలో టీబీ నిర్మూలన కోసం 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. వ్యాధి సోకిన వారు ఆరు నెలలు మందులు వాడితే TB తగ్గుతుందన్నారు.