కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

కామారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన కటికే విట్టల్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై జిల్లా కేంద్రానికి వెళ్తుండగా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయాలైన విట్టల్‌ను స్థానికులు వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.