ఘనంగా విశ్వహిందూ పరిషత్ దినోత్సవం

SRCL: వేములవాడ పట్టణంలో సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థాపన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జాతీయ గోరక్షణ సహ కార్యదర్శి ఆకారపు కేశవరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హిందువుల సంఘటితం, గోహత్యలు అడ్డుకోవడం, మతమార్పిడి లకు గురికాకుండా మందిరాలు, వేదాలు, ఉపనిషత్తులు ,దేశ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడటం కోసం వీహెచ్ పి ని ప్రారంభించారన్నారు.