ఘనంగా రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు
KMR: బిక్కనూరు మండలం భగీరత్‌పల్లిలో సోమవారం రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గౌడ సంఘం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. గ్రామస్థులు అమ్మవారిని కనులారా తిలకించి దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని ఆలయ అధికారులు తెలిపారు.