నడిరోడ్డుపై వడ్ల ట్రాక్టర్ బోల్తా
SRPT: నేరెడుచర్ల మండలం చిల్లపళ్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. స్థానిక చిన్న బ్రిడ్జి సమీపంలో వడ్ల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి నడిరోడ్డుపైనే బోల్తా పడింది. ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. అదృష్టవశాత్తూ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.