కొత్త ఉపరాష్ట్రపతి నైతికత పాటించాలి: ఖర్గే

ఇండియా కూటమి అభ్యర్థిగా బి.సుదర్శన్ రెడ్డి పోరాటానికి కృతజ్ఞతలు అని పీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది ఎన్నిక మాత్రమే కాదు.. సిద్ధాంతాల యుద్ధం అని తెలిపారు. కొత్త ఉపరాష్ట్రపతి పార్లమెంటరీ సంప్రదాయాలు పాటిస్తారని ఆశిస్తున్నానన్నారు. నైతికత పాటిస్తూ.. ప్రతిపక్షాలకు సమానస్థానం కల్పించాలన్నారు. ఉపరాష్ట్రపతి సూటిగా, పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలన్నారు.