భారీగా నల్లబెల్లం పట్టివేత

భారీగా నల్లబెల్లం పట్టివేత

MHBD: జిల్లాలో భారీస్థాయిలో నల్లబెల్లం పట్టుబడింది. సారాయి తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్, కురవి పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోమ్లాతండా వద్ద లారీని ఆపి తనిఖీ చేయగా, రూ.8లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి, లారీ సీజ్ చేశారు.