బెట్టింగ్ యాప్‌కు బానిసై.. విద్యార్థి మృతి
KKD: జిల్లాలోని గండెపల్లి మండలంలో సూరంపాలెంలో ఓ విశ్వవిద్యాలయ వసతి గృహంలో అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకొని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మాడుగుల గ్రామానికి చెందిన మహ్మద్ బషీర్(22) ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బెట్టింగ్ గేమ్స్‌కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడన్నారు. ఆప్పుల బాధ భరించలేకే ఉరి వేసుకొని మృతి చెందినట్లు తెలిపారు.