ఏలూరులో విజిలెన్స్ తనిఖీలు

ఏలూరులో విజిలెన్స్ తనిఖీలు

ELR: ఏలూరులోని ఒక హోటల్లో గృహ అవసరాల సిలిండర్లను వాడటాన్ని గుర్తించిన విజిలెన్స్ అధికారులు దాడి చేశారు. రీజనల్ విజిలెన్స్ అధికారి కే. నాగేశ్వరరావుకు అందిన సమాచారం మేరకు, ఎస్సై కే. నాగరాజు ఆధ్వర్యంలో రెవెన్యూ, పౌర సరఫరాల సిబ్బందితో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో గృహ అవసరాలకు వాడే 9 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నిర్వాహకుడిపై కేసు నమోదుచేశారు.