ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో రాజానగర్ కుర్రాడు

E.G: రెండు లక్షల ధాన్యం గింజలతో శ్రీ వేంకటేశ్వరుని బొమ్మను రాజానగరానికి చెందిన 20 ఏళ్ల బబ్లు చిత్రీకరించాడు. రెండు రోజుల క్రితం యువకుడి ప్రతిభకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది. చిన్నతనం నుంచి డ్రాయింగ్‌పై ఆసక్తి కనపరిచిన బబ్లు ఇంటర్ వరకు రాజమండ్రిలో చదివాడు. ప్రస్తుతం ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ సహకారంతో ఆర్ట్స్అండ్‌క్రాఫ్ట్ కోర్స్ చేస్తున్నాడు.