వరదలతో 7 వేల కోళ్లు మృతి

NTR: నందిగామ మండలం గొల్లమూడి గ్రామం వద్ద వైరా ఏటి వరద కోళ్ల ఫారాన్ని ముంచెత్తింది. గురువారం షెడ్డులోని సుమారు 7 వేల కోళ్లు మృతి చెందగా, రూ.15 లక్షల వరకు నష్టం వాటిల్లిందని యజమాని అట్లూరి రత్నబాబు తెలిపారు. ఈ సంఘటనతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.