ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

NLG: యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో చోటు చేసుకుంది. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆరూరి శివ(23)ను పెండింగ్‌లో ఉన్న EMIలు కట్టాలని ఒత్తిడి చేశారు. దీంతో మనస్థాపానికి గురైన శివ ఊరి శివారులో ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవి తెలిపారు.