రైతన్నా తీరు మార్చుకో..!

రైతన్నా తీరు మార్చుకో..!

మెదక్: వరి కొయ్యలను కాల్చడం వల్ల పంట ఎదుగుదలకు అవసరమయ్యే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాలు మంటవేడికి తట్టుకోలేక నశించిపోతాయని వ్యవసాయ అధికారులు ఎన్నిసార్లు రైతులకు అవగాహన కల్పించినప్పటికీ తీరు మారడం లేదు. నిజాంపేట మండలం రాంపూర్లో ఓ రైతు వరి కొయ్యలను ఉదయాన్నే యథేచ్చగా కాలుస్తున్నారు. రైతులు వరి కొయ్యలను కాల్చవద్దని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.