VIDEO:అనంతగిరిలో భారీ వర్షం - నీటి మునిగిన పొలాలు

SRPT: సూర్యాపేట జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతగిరి మండలం సింగారం – కోదాడ రోడ్డులో వెంకట్రామాపురం బంధం వద్ద భారీ వరద ప్రవాహం ఏర్పడింది. వరద నీరు నడుము లోతు వరకు చేరడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ప్రభావంతో చాలా చోట్ల పంటపొలాలు నీట మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.