VIDEO: రోడ్డు మరమ్మతు పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
కృష్ణా: పమిడిముక్కల మండలం నారాయణపురం రోడ్డు మరమ్మతు పనులను మంగళవారం ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పరిశీలించారు. నారాయణపురం, అగినపర్రు, మామిళ్లపల్లికి వెళ్లే రోడ్డు మరమ్మతు పనులను పీ4 పథకం ద్వారా చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. వేసవి కాలంలోపు మండలంలోని మొత్తం రోడ్లన్నింటినీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.