‘కాంగ్రెస్ వల్ల ప్రజలపై రూ.3 లక్షల కోట్ల భారం’
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ బాండ్లతో చేసిన తప్పు వల్ల దేశ ప్రజలు రూ.3 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చిందని PM మోదీ విమర్శించారు. అప్పట్లో రిమోట్ కంట్రోల్ పాలన సాగిందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చాక 55 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరిచి విప్లవాత్మక మార్పు తెచ్చామన్నారు. గతంలో పథకాలు ప్రకటనలకే పరిమితమయ్యేవని, ఇప్పుడు ప్రతి పథకం ఆచరణలోకి వస్తోందని తెలిపారు.