దొంగ అరెస్ట్.. బంగారం స్వాధీనం

దొంగ అరెస్ట్.. బంగారం స్వాధీనం

SRPT: సూర్యాపేట పట్టణంలో వరుస చోరీలకు పాల్పడుతున్న గుండె శ్రీకాంత్‌ను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకట్ తెలిపారు. సాయినగర్, కోర్టు ఆవరణలో చోరీలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించారు.