తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర అమోఘం: గుత్తా అమిత్

తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర అమోఘం: గుత్తా అమిత్

NLG: కాంగ్రెస్ అధినేత్రి సోనియా ముందడుగు వేయకపోతే తెలంగాణ వచ్చేదే కాదని రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియా పాత్ర అమోఘమని కొనియాడారు. తన స్వగ్రామమైన చిట్యాల మండలం, ఉరుమడ్ల లో తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మంగళవారం గ్రామ నాయకులు, కార్యకర్తల మధ్య నిర్వహించారు.