గ్రామంలో వీధి దీపాలు పెట్టండి సారూ..!

MNCL: జన్నారం మండలం కామన్ పల్లి గ్రామంలో గత వారం రోజులుగా వీధి దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులకు అనేకసార్లు తెలియజేసినా ఎటువంటి స్పందన లేకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. వినాయక చవితి సమీపిస్తుండగా అధికారులు స్పందించి బల్బులు అమర్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.