మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి మళ్లీ పోటీ
భూపాలపల్లి మండలం గుడాడ్పల్లి గ్రామ పంచాయతీ రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి మళ్లీ బరిలో నిలిచారు. గత ఎన్నికల్లో జనరల్ స్థానం నుంచి గెలిచిన ఆమె, ప్రస్తుతం బీసీ మహిళ రిజర్వు కాగా మళ్లీ అవకాశం దక్కింది. గతంలో ఆమె భర్త ఐలయ్య కూడా సర్పంచ్‌గా పనిచేశారు. భార్యాభర్తలు ఇద్దరూ బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు గెలుపొందారు.