రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

కోనసీమ: రాష్ట్రస్థాయి సెపక్ తక్ర పోటీలకు అమలాపురం మండలం ఇందుపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి విద్యార్థిని తూటారపు వర్షిణి ఎంపికయింది. ఆమె జిల్లా స్థాయి పోటీలలో విజయం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైందని హెచ్ఎం లంక రాణి బుధవారం తెలిపారు. ఈనెల 6, 7,8 తేదీలలో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో వర్షిని పాల్గొంటుందన్నారు.