పాంబండ రామలింగేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు
VKB: జిల్లాలోని బండ వెల్కిచర్ల గ్రామంలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ అగ్ని గుండం కార్యక్రమం ఉంటుందని ఆలయ ఈవో బాల నర్సయ్య, ఆలయ ఛైర్మన్ మహిపాల్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.