11 మృతదేహాలను గుర్తించాం: డీఐజీ
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదాన్ని జిల్లా కలెక్టర్ సిరి, డీఐజీ కోయ ప్రవీణ్ ఇవాళ పరిశీలించారు. బస్సులో ఉన్న 21 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. మరో 20 మందిలో 11 మృతదేహాలను గుర్తించామని చెప్పారు. మిగిలిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. బస్సులో 39 మంది పెద్దలు, ఇద్దరు పిల్లలు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు చెప్పారు.