'సర్కారుపై రైతులు తిరుగుబాటు చేయాలి'
NZB: రైతు డిక్లరేషన్ను అమలు చేయకుండా రైతులకు వెన్నుపోటు పొడిచిన రేవంత్ రెడ్డి సర్కారుపై అన్నదాతలు తిరుగుబాటు చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బుధవారం విస్తృతంగా పర్యటించిన జీవన్ రెడ్డి రైతులతో సమావేశాలు నిర్వహించారు.