'వందే భారత్ రైలును నిలపాలి'

MNCL: నాగపూర్ సికింద్రాబాద్ వందే భారత్ రైలును మంచిర్యాలలో ఆపాలని కోరుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నకు జిల్లా భాజపా నాయకులు వినతిపత్రం అందజేశారు. ఆదాయపరంగా మంచిర్యాల రైల్వే స్టేషన్ మెరుగైన స్థానంలో ఉందని, ఈ రైలు నిలుపుదలతో మరింత పెరుగుతుందని వారు మంగళవారం తెలిపారు. ఇక్కడ ప్రజలకు లబ్ధి చేకూరుతుందని రాతపూర్వకంగా అవసరాన్ని వివరించినట్లు పేర్కొన్నారు.