లైన్ షోయింగ్ విధానంలో వరి నాట్లు

SKLM: వ్యవసాయంలో లైన్ షోయింగ్ విధానం ద్వారా వరి నాట్లు వేసుకున్నట్లయితే ఎంతో ప్రయోజనం కరంగా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ తోట రమణ తెలిపారు. గురువారం నరసన్నపేట మండలం రావులవలస గ్రామంలో దామోదర మేరీ ప్రకృతి వ్యవసాయ సాగులో వరి నాట్లు చేపట్టారు. ఈ పద్ధతి వలన వెలుతురు, గాలి సమృద్ధిగా మొక్కలకు అందుతుందని, చీడపీడల నుండి రక్షణ పొందవచ్చునన్నారు.