హంసలదీవి క్షేత్రాన్ని దర్శించుకున్న చాగంటి

హంసలదీవి క్షేత్రాన్ని దర్శించుకున్న చాగంటి

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దివిసీమ ఆధ్యాత్మిక పర్యటన కొనసాగుతోంది. సోమవారం కోడూరు మండలంలోని ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన హంసలదీవి క్షేత్రాన్ని దాదాపు 250మందికి పైగా శిష్య బృందంతో దర్శించుకున్నారు. అనంతరం హంసలదీవిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు.